బాహుబలి డైరెక్టర్ తురుమా ? ఘాజీ డైరెక్టర్ తోపా ? - MicTv.in - Telugu News
mictv telugu

బాహుబలి డైరెక్టర్ తురుమా ? ఘాజీ డైరెక్టర్ తోపా ?

June 2, 2017

ఈ మధ్య రాజమౌళి తోపు, తురుం అని ఆయన పేరు బాగా పాప్యులర్ అయిపోయింది.. ఎందుకయ్యా ఇంత లొల్లీ అంటే బాహుబలి అంటున్నారు. బాహుబలి నిజంగా అంత గొప్ప సినిమానా ? ఆ సినిమాకి అంత సీనుందా ? నిజమే ఘాజీ సినిమాని గనక రాజమౌళి ప్రొడ్యూస్ చేసుంటే దిమ్మ తిరిగిపోయే బిజినెస్ అయిపోయేదేమో ? పదికి పది పక్కా కమర్షియల్ సినిమాలు, తీసిన కథలనే తిప్పి తిప్పి తీసి ఇంకా ఏదో చెయ్యాలనే తపనతో భారీ బడ్జెట్ తో బాహుబలిని రెండు పార్టులుగా తీసి అందరి దృష్ఠిని తన వైపుకి తిప్పుకోవడం రాజమౌళి యొక్క ఒక గొప్ప స్ట్రాటజీ.. మరి ఘాజీ తీసిన సంకల్ప్ రెడ్డిని ఏమనాలి ? తోపు, తురుంల అయ్య అనాలా ? డెబ్యు మూవీతోనే దేశం దృష్ఠిని ఆకర్షించిన సంకల్ప్ కాదా ఎక్సెలెంట్ డైరెక్టర్ అంటే ? ఆస్ట్రేలియాలో ఫిల్మ‌‌్ కోర్సు చేసొచ్చి ఘాజీ సినిమా తీసి ‘ యమ్మ ఎంట్రీనె ఇంత పర్ ఫెక్టా ‘ అని చాలా మంది నోర్లు తెరిపించాడు ??
సబ్ మెరేన్ నేపథ్యంలో అల్లుకున్న కథకి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకోకుండా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో అద్భుతంగా తీసాడు అదీ బోణీ సినిమాతోనే. సినిమాని పక్కా కమర్షియలైజ్ చేసి క్యాష్ చేస్కుందామనే థీమ్ లో వున్నాడు రాజమౌళి సారు. సంకల్ప్ మాత్రం సినిమాని ప్రజలకు ఎలా దగ్గర చెయ్యాలి, వ్యాపారాత్మకమైన సినిమా గాకుండా ఒక మంచి సినిమాని అందించాలనే సంకల్పమున్నవాడనిపిస్తుంది సంకల్ప్ ఘాజీ చూస్తే… కోట్లు ఖర్చుపెట్టి కోట్లకు కోట్ల రూపాయలను వసూలు చేయడమే పనిగా పెట్టుకున్న రాజమౌళి గొప్పవాడా ..లేకపోతె కోట్లాది ప్రేక్షకులకి నచ్చే మంచి సినిమాని తియ్యాలా అని అనుకుంటున్న సంకల్ప్ గొప్పవాడా ??