తలైవా…ఫిట్ మంత్ర..!
ఆయన తమిళోళ్లకు తలైవా…దేశం మొత్తాని సూపర్ స్టార్,బస్ కండక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టి సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నారు.66 ఏళ్ళ వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ.. తన స్టైల్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నాడు,ఇటివలే రజనీకాంత్ తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు.అక్కడ ఆయన్ను పరీక్షించిన డాక్టర్స్…రజనీ సూపర్ ఫిట్ గా ఉన్నారని.. అన్ని చెకప్ లు చేసి చెప్పారట,ఇంకో వారంలో రజనీ చెన్నై వస్తారట..ఇగ వచ్చిన తర్వాత నైనా రజనీ..తన రాజకీయ ప్రవేశంపై ఒక నిర్ణయం తీస్కునే అవకాశం ఉందట.
రజనీ ఫిట్ నెస్ రహస్యం…ఏంటంటే..?
ఆరుపదుల మీదున్న వయసులో కూడా ఆయన యువకుడిలా ఉత్యాహంగా ఉండటానికి కారణం ఆయన పాటించే కఠిన దినచర్యే.రోజు రెండు పూటలు యోగా,ఎక్సర్ సైజ్ లు చేయడం ఆయనకు అలవాటు,ఉదయం 5 గంటలకే లేచి ముందు వాకింగ్ చేస్తారట,ఆ తర్వాత యోగా ధ్యానం.మళ్లీ సాయంత్రం కూడా…తినె ఫుడ్డులో కూడా చాలా నియమాలు..రజనీ కొన్ని సంవత్సరాలుగా చక్కెర,అన్నం,పాలు,పెరుగు,నెయ్యి తినడం మానేశారట,మొలకెత్తిన విత్తనాలు…వంటి కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలే తీసుకుంటారట,ఆద్యాత్మిక,మానసిక ప్రశాంతతకోసం అప్పుడప్పుడు హిమాలయాలకు కూడా వెళ్తారు…ఇవి సూపర్ స్టార్ గారి ఫిట్ నెస్ వెనకాలున్న రహస్యాలు.సో ఆయన స్టైల్ ని ఆయన డైలాగ్స్ ని చూసి కాపీ కొట్టిన ఓ అభిమానులు..కబాలి ఫిట్ నెస్ మంత్రాని కూడా కాపీ కొట్టేయండి.అప్పుడు ఆరోగ్యం ఆనందం రొండు మీ వెంటే.