రజనీకాంత్ అంటేనే ఒక బ్రాండ్, ఒక ఐకాన్. ఎంతో మందికి ఇన్సిపిరేషన్ గా నిలిచే తలైవా జీవితం గురించి అందరికీ తెలిసిందే. అలాగే ఆయనకుండే క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. 70 ఏళ్ళ వయసులోనూ సినిమాలు చేస్తూ, అదీ హీరోగా….సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో జైలర్ అనే సినిమా చేస్తున్నారు. అదికాక తన కూతరు దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్ లో ఐశ్వర్య రజనీకాంత్ డైరక్షన్ చేస్తున్న సినిమా లాల్ సలామ్. దీనిలో విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీలో రజనీ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. దానికోసం వారం రోజులు కాల్షీట్లు ఇచ్చారుట. ఇప్పడు ఆ ఏడు రోజుల షూటింగ్ కోసమే రజనీకి పే చేస్తున్న ఎమౌంట్ ఎంతో తెలుసా…అక్షరాలా పాతిక కోట్లు. ఇండియాలో ఏ హీరోకి ఇంత క్రేజ్ లేదు. సొంత కూతురు మూవీ అయినా సరే ఆయన రెమ్యునరేషన్ తగ్గేదే లేదు.
ఈ వారం రోజుల గెస్ట్ రోల్ కే ఇలా ఉంటే ఇ్ మామూలు సినిమాల గురించి చెప్పేదేముంది. రజనీ చేస్తున్న జైలర్ మూవీ రెమ్యునరేషన్ అయితే ఏకంగా 14 కోట్లు అని టాక్. దక్షిణాదిలో ఇంత డబ్బులు తీసుకుంటున్నది ఒక్క రజనీకాంత్ మాత్రమే. ఎంతైనా తలైవా కి సాటి ఎవరూ రాలేరు.