పిల్ల పుట్టకముందే కుల్ల రెడీ ! ? - MicTv.in - Telugu News
mictv telugu

పిల్ల పుట్టకముందే కుల్ల రెడీ ! ?

July 4, 2017

త్వరలోనే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టనున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాగ్జిమమ్ పార్టీ పెట్టడం ఖాయమే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. రజనీకాంతుకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా తను రాజకీయాల్లోకి దిగితే నెక్ట్స్ సీఎం అవడం ఖాయం అనే భరోసాలో వున్నాయి అక్కడి పాలిటిక్స్. ఇన్ని రోజులు అమ్మ వుందని కామ్ గా వున్న రజిని ఈసారి తప్పకుండా తను రాజకీయాల్లోకి వస్తానని పరోక్షంగా అంటున్నాడు.

తమిళనాడు ప్రజలు కూడా రజనీని పాలిటిక్స్ లోకి ఆహ్వానిస్తున్నారు కూడా. అయితే అధికారికంగా పార్టీ, దాని కార్యవర్గ నమూనాలను, సిద్ధాంతాలను, జెండాను, అజెండా వంటివన్నీ లోలోపల కార్యరూపాలను సంతరించుకుంటున్నాయి. ఆ డిజైన్ మొత్తం ఫైనల్ చేస్కున్నాక పక్కా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అధికారికంగా పూర్తి రాజకీయాల్లోకి వచ్చే సూచనలైతే మెండుగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం రజనీ కాలా, రోబె2.0 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమాల తర్వాత రజనీ మళ్ళీ కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. రజనీ పార్టీ పెడితే అది తమిళనాడు వరకే అంకితమైపోదు. ఎందుకంటే రజనీకి మన దేశంలోని ఏ రాష్ట్రానికెళ్ళినా పిచ్చ ఫ్యాన్స్ వున్నారు. కాబట్టి తన పార్టీ స్టేట్ లెవల్లో వుండకూడదని నేషనల్ పార్టీగానే తీస్కొచ్చే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పార్టీ పాప్యులారిటీ కోసం పాప్యులర్ మనుషులే పబ్లిసిటీ చెయ్యాలనుకొని లోలోపల కార్యాచరణ మొదలు పెట్టేసారు అప్పుడే.

ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రచార కర్తగా పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ను, తెలంగాణ నుండి ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను రంగంలోకి దించాలనే మతలబులు సాగుతున్నాయట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తను కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్కునే పనిలో వుండగా ఇంకొక పార్టీ కోసం పని చేస్తాడనుకోవడం పొరపాటేమో అనిపిస్తోంది. ఇక గద్దర్ విషయం గురించి ప్రస్తావించుకుంటే ‘ ఓట్లేసె అక్కలకు వేలవేల వందనాలు – ఓట్లెయ్యని అక్కలకు కోటి కోటి వందనాలు ’ అని ఓటర్ల గురించి ఎంతో పాజిటివ్ గా పాట కట్టిన గద్దర్ రజనీ పార్టీకి నౌకగా నడుస్తాడేమో అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ మధ్య గద్దర్ కూడా పార్టీ పెడతాడనే పుకార్లు వచ్చాయి కానీ గద్దర్ ఎప్పటికీ ప్రజలమనిషిగానే వుంటానని చెప్పడంతో అనుమానాలు తొలగాయి. చూడాలి మరి రజనీ కొత్త పార్టీకి పవన్, గద్దర్లు ఎలా వర్కౌట్ అవుతారనేది !? దీన్నే పిల్ల పుట్టకముందే కుల్ల రెడీ చెయ్యడమని !!