సిరిసిల్ల జిల్లాలో దారుణం.. ఎంపీటీసీ భర్త హత్య - MicTv.in - Telugu News
mictv telugu

సిరిసిల్ల జిల్లాలో దారుణం.. ఎంపీటీసీ భర్త హత్య

March 7, 2018

పాతకక్షలు మనిషి ప్రాణం తీశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ఎంపీటీసీ చంద్రకళ భర్త వీరబోయిన దేవయ్యను బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కొత్తపల్లిలోని ఓ హోటల్ వద్దకు వచ్చిన దుండగులు అక్కడే ఉన్న దేవయ్యను విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు.

అతను అక్కడే చనిపోయాడు. దేవయ్యను అతని శత్రువులే పాత పగలతో చంపారని స్థానికులు చెబుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.