ప్రేమపెళ్లి వ్యవహారం అమాయకుడి ప్రాణాలను బలితీసుకుంది. తమ అమ్మాయిని లేవదీసుకుని వెళ్లాడన్న అక్కసుతో బంధువులు దారుణానికి తెగబడ్డారు. యువకుడి తండ్రిని చంపేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి గౌతమి, మహేశ్ ప్రేమించుకున్నారు. అయే వారి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో ఇద్దరూ పెద్దలకు చెప్పకుండా దసరా రోజున ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.
దీన్ని అవమానంగా భావించిన గౌతమి కుటుంబ సభ్యులు మహేశ్ ఇంటిపై దాడి చేశారు. అతని తండ్రి లక్ష్మీనారాయణను కర్రలతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన పెద్దాయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో నాలుగు రోజు చికిత్స పొందిన లక్ష్మినారాయణ ఈ రోజు పరిస్థితి విషమించి చనిపోయాడు. గౌతమి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని మహేశ్ కుటుంబ సభ్యులు కోరతున్నారు.