యాక్సిడెంట్‌పై రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

యాక్సిడెంట్‌పై రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్

November 13, 2019

సినీ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున అదపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలైనట్టు కథనాలు వచ్చాయి. ఆయన ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. అయితే దీనిపై ఆయన కూతురు హీరోయిన్ శివాత్మిక స్పందించారు.

కారు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన ఆరోగ్యంపై సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శివాత్మిక ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. ‘నాన్న ప్రమాదానికి గురైన విషయం నిజమే. అయితే నాన్న అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం నాన్న బాగున్నారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా గతంలోనూ ఓసారి రాజశేఖర్ కారు రింగు రోడ్డు వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆయన క్షేమంగా బయటపడ్డారు.