Rajasingh granted bail
mictv telugu

రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం

August 23, 2022

Rajasingh granted bail

మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెయిల్ మంజూరైంది. అరెస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలు సరిగ్గా పాటించలేదనే రాజాసింగ్ తరపు న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఆయనను వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.

సీఆర్‌పీసీ 41 – ఎ కింద బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి మత విద్వేషాలు చేయవద్దని, కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహకరించాలని రాజాసింగ్‌ను ఆదేశించారు. కాగా, మంగళ్ హాట్‌లో ఖాదిర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించి అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత పోలీసులు రాజాసింగ్‌ను చంచల్ గూడ జైలుకు తరలించగా, తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయనను విడుదల చేయనున్నారు.