Rajasingh's Indecent Comments on Prophet Muhammad...Part-2 is also included
mictv telugu

మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు…పార్ట్-2 కూడా ఉంది

August 23, 2022

హైదరాబాద్‌లోని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్‌ ప్రవక్తను కించపరుస్తూ, యూట్యూబ్‌లో సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. దాంతో అగ్రహించిన మజ్లిస్‌ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాజాసింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ గతరాత్రి నుంచి మజ్లిస్‌ నేతలంతా ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

ఈ క్రమంలో పరిస్థితిని గమనించిన పోలీసులు..మంగళవారం ఉదయం రాజాసింగ్‌ ఇంటి వద్ద భారీగా మోహరించారు. రాజాసింగ్‌.. ముస్లింల మనోభావాలు కించపరిచారంటూ మజ్లిస్‌ నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సీపీ కార్యాలయానికి వెళ్లారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో​ పోలీసులు..యూట్యూబ్‌లో రాజాసింగ్‌ అప్లోడ్ చేసిన ఆ వీడియోను తొలగించారు.

 

అనంతరం రాజాసింగ్ కాసేపటిక్రితమే మీడియాతో​ మాట్లాడుతూ..’మునావర్‌కు కౌంటర్‌ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్‌ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో కూడా నా వద్ద ఉంది. త్వరలోనే దానిని కూడా అప్‌లోడ్‌ చేస్తా. యాక్షన్‌కు రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నాను” అని అన్నారు.