పూజారిని కాల్చేశారు.. రాజస్తాన్‌లో అర్ధరాత్రి ఘోరం..  - MicTv.in - Telugu News
mictv telugu

పూజారిని కాల్చేశారు.. రాజస్తాన్‌లో అర్ధరాత్రి ఘోరం.. 

October 9, 2020

Rajasthan 50-year-old temple priest set on fire by land mafia in Karauli

రాజస్తాన్‌లో ఓ ఆలయ పూజారిని పెట్రోల్ పోసి కాల్చేశారు. కరౌలి జిల్లా సత్పూరా ప్రాంతంలోని బక్నా గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆలయ భూవివాదమే దీనికి కారణమని భావిస్తున్నారు.  

ఆలయానికి చెందిన భూమిని కొన్నేళ్ల కిందట గ్రామపెద్దలు పూజారి బాబూలాల్‌కు కానుకగా ఇచ్చారు. ఇటీవల అతడు అక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. అయితే అది తన భూమి అని కైలాస్ మీనా అనే వ్యక్తి ఆయనతో గొడవ పడ్డాడు. దీంతో తోపులాట కూడా జరిగింది. గ్రామపెద్దలు పూజారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే  ఆ స్థలంలో నిందితుడు గుడిసె నిర్మించి కయ్యానికి కాలు దువ్వాడు. నిన్నరాత్రి తన కొడుకులు, అనుచరులతో కలసి అక్కడ ఉన్న ధాన్యాన్ని కాల్చేశాడు. పూజారిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన బాబూలాల్ ప్రస్తుతం జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కైలాస్, అతని కొడకులే తనను చంపడానికి యత్నించారని ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.