ప్రాంక్ వీడియోలు చేస్తున్నారా? ఇల తాట తీస్తారు జాగ్రత్త! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాంక్ వీడియోలు చేస్తున్నారా? ఇల తాట తీస్తారు జాగ్రత్త!

June 25, 2022

సరదా కోసం ప్రాంక్ వీడియోలు చేసి సోషల్ మీడియో పోస్ట్ చేస్తుంటారు యువతీ యువకులు. ముసలాళ్లు కూడా చేస్తుంటారు గాని వాటికి పెద్దగా వ్యూస్ ఉండవు. ఎంత వెరైటీగా చేస్తే అన్ని లైకులు, కామెంట్లు, పైసలు వస్తాయి. కొందరు కుర్రాళ్లు ఈ కిటుకులో రాటుదేలిపోయారు. రాజస్తాన్ అజ్మేర్‌కు చెందిన ఇద్దరు టీనేజర్లు ఆ టైపే. చిత్రవిచిత్రమైన గెటప్పులు వేసుకుని ప్రాంకులు చేసి తుత్తి పొందడం వీళ్ల పని.

వెరైటీ వీడియో కోసం ఇటీవల ఆ ఇద్దరూ ఆడవాళ్లలా బురఖాలు వేసుకుని తిప్పుకుంటూ తిప్పుకుంటూ నడుస్తూ బజారు కెక్కారు. పాపం, ఆ సంగతి తెలియని అక్కడిజనం ఈ వింతజీవులను అనుమానంగా చూశారు. పిల్లలను ఎత్తుకుపోయే ముఠా గ్యాంగ్ అనుకుని బంధించారు. ప్రాంకు వీరులు సరైన సమాధానం చెప్పకపోవడంతో గొడవ మొదలైంది. అందరూ కలసి ట్రాన్స్ కుర్రాళ్లను చితకబాదేశారు. దెబ్బలకు తాళలేక అసలు విషయం చెప్పినా వినకుండా పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పెషల్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు .