35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల.. ఎం చేశారంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల.. ఎం చేశారంటే..

April 23, 2021

Rajasthan family hires helicopter to bring home first girl child born in 35 years

ఆడపిల్ల పుడితే కొందరికి ఇప్పుడూ మూతుడు ముడిచుకుపోతాయి. కొందరు మహాలక్ష్మి పుట్టిందని పండగ చేసుకునేవాళ్లూ ఉంటారు. వాళ్లు కూడా అలాగే చేశారు. పుట్టిన పాప తమ ఇంటికి వచ్చిన రోజు గుర్తుండిపోవాలని ఏకంగా హెలికాప్టర్‌లో ఆ చిన్నారిని తీసుకొచ్చారు.
రాజ‌స్థాన్‌లోని నౌగౌర్ జిల్లాకు చెందిన హ‌నుమాన్చుకీదేవి దంప‌తులకు ఆడపిల్ల పుట్టింది. హనుమాన్ వంశంలో గత 35 ఏళ్ల పాప పుట్టడం ఇదే తొలిసారి. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లి చుకీ దేవి తిరిగి అత్తింటికి రావాలనుకుంది. పాపను తీసుకురావడానికి హనుమాన్ ఏకంగా హెలికాప్టర్ బుక్ చేశాడు. 40 కిలోమీటర్ల దూరంలోని ఉన్న అత్త‌గారింటికి హెలికాప్ట‌ర్‌లో వెళ్లి భార్యాబిడ్డలను ఘనంగా అందులోనే ఇంటికి తీసుకొచ్చాడు. ఊరంత పండగ వాతావరణం నెలకొంది. హెలికాప్టర్ కోసం 5 లక్షలు ఖర్చయింది.