అల్వార్ రేప్ బాధితురాలికి పోలీసు ఉద్యోగం - MicTv.in - Telugu News
mictv telugu

అల్వార్ రేప్ బాధితురాలికి పోలీసు ఉద్యోగం

May 20, 2019

రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులు ఆ దుర్మార్గాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో రాజస్తాన్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో ప్రభుత్వం దిద్దబాటు చర్యలు చేపట్టింది. బాధితురాలికి పోలీసు శాఖలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.

Rajasthan governmengt offers police job to Alwar gang-rape victim she recently expressed the desire to join police services to deal with those who commit heinous crimes .

తనపై జరిగిన అఘాయిత్యం మరెవరిపైనా జరగకుండా పోలీసు ఉద్యోగంలో చేరతానని బాధితురాలు ఇటీవల చెప్పింది. దీంతో ఆమెకు పోలీసు ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల థనగాజి-అల్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న జంటను ఆరుగురు అడ్డుకున్నారు. భర్తపై దాడి చేసి, అతని ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాగా, రాజస్తాన్‌లోని ఛతర్‌గఢ్‌లో వంటచెరకు కోసం బంజరు భూమికి వెళ్లిన వివాహతపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 15న జరిగిన ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు.