కరోనా రోగులను కలవొచ్చు.. ఆ సర్కార్ సంచలన నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రోగులను కలవొచ్చు.. ఆ సర్కార్ సంచలన నిర్ణయం

September 19, 2020

ngn

కరోనా వచ్చిందంటే చాలు బంధువులు కూడా రోగులను చూసేందుకు వెనకా ముందు అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ఎవరూ కలవకుండా కట్టుదిట్టమైన చర్యలతో చికిత్స అందిస్తూ వస్తున్నాయి. కానీ రాజస్థాన్ సర్కార్ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని వారిని చూసేందుకు వీలు కల్పించారు. 

రోగులు ఒంటరితనం వల్ల కలిగే ఒత్తిడిని బయటపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు. రోగుల బంధువులు ఎవరు వచ్చినా, పీపీఈ కిట్, ఇతర రక్షణ పరికరాలు ధరించిన తర్వాత లోపలికి పంపిస్తామని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా వారి కోసం ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా అందించేందుకు అవకాశం ఇచ్చారు. కాగా, మహమ్మారి వ్యాప్తి నుంచి వీలైన తొందరగా బయటపడేందుకు అక్కడి ప్రభుత్వం పటిష్ట చర్యలను అవలంభిస్తోంది.