తనకు తాను.. సుపారీ ఇచ్చి మరీ చంపించుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

తనకు తాను.. సుపారీ ఇచ్చి మరీ చంపించుకున్నాడు..

September 10, 2019

Rajasthan man.

సహజంగా ఎవరైనా వారితో శత్రుత్వం ఉన్నవారిని చంపించడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయిస్తారు. కానీ, రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన బాల్బీర్ తనను చంపాలని కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. బాల్బీర్ వృత్తి రీత్యా వ్యాపారి కావడంతో అవసరం కోసం అధిక వడ్డీకి రూ.20 లక్షలు అప్పు చేసాడు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. ఒకానొక సమయంలో అప్పులకు వడ్డీ కూడా కట్టలేకపోయాడు. దీంతో అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరిగింది. 

ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తోచక తనను హత్య చేయించుకుంటే తన పేరుపై ఉన్న రూ.50లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా సొమ్ము కుటుంబానికి అందుతుందని, దీంతో అప్పులన్నీ తీరిపోతాయనుకున్నాడు. పథకం ప్రకారం రూ.8,43,200 చెల్లించి రూ.50 లక్షలకు ప్రమాద బీమా తీసుకున్నాడు. తరువాత కొన్ని రోజులకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కిరాయి హంతకుడు సునీల్‌ యాదవ్‌ను పిలిపించి తన హత్యకు రూ.80 వేలు సుపారీ ఇచ్చాడు. సునీల్‌ తోడుగా మరో హంతకుడు రాజ్‌వీర్‌ను పిలిపించుకొని బల్బీర్‌ను హత్య చేశాడు. హత్యకు రెండు రోజుల ముందు తనను ఎక్కడ చంపాలో ఆ ప్రాంతాన్ని హంతకులకు చూపించాడు. మొత్తానికి అనుకున్నట్టుగానే బాల్బీర్‌ను కిరాయి హంతకులు హత్య చేశారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా హంతకులు దొరికారు. దీంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. కానీ, ఈ ప్రమాద బీమా గురించి, హత్య కుట్ర గురించి తమకు తెలియదని బాల్బీర్ కుటుంబం వెల్లడిస్తోంది.