కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని.. కొడుక్కి ఏం పేరు పెట్టాడో తెలుసా..? - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని.. కొడుక్కి ఏం పేరు పెట్టాడో తెలుసా..?

January 22, 2020

vbnm gjn

రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు తమకు పుట్టిన పిల్లలకు తమకు ఇష్టమైన నేతల పేర్లు పెట్టుకోవడం సర్వ సాధారణం. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పార్టీ పేరు పెట్టుకున్నాడు. తన కుమారుడికి ‘కాంగ్రెస్ జైన్’ పేరు పెట్టి సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడు. అంతటితో ఆగిపోకుండా 18 ఏళ్లు నిండిన తర్వాత తన కొడుకు రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాడని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.

ఉదయ్‌పూర్‌కు చెందిన వినోద్ జైన్ అనే వ్యక్తికి గత ఏడాది జులైలో కొడుకు జన్మించాడు. అతనికి ఇటీవల‘కాంగ్రెస్ జైన్’ అనే పేరు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలా పెట్టడం వెనక అతనికి పార్టీతో కీలక అనుబంధం ఉండటంమే కారణం. చాలా కాలంగా అతని కుటుంబం కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ.. సేవ చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ కుటుంబంలోని తర్వాతి తరాలు కూడా  దీన్ని కొనసాగించాలనే ఇలా చేశాడట. దీనికి ముందుగా కుటుంబ సభ్యులు అంగీకరించపోయినా వారిని ఒప్పించి మరీ తన నిర్ణయాన్ని అమలు చేశాడు. కాగా వినోద్ జైన్ ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం కార్యాలయంలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు.