నన్ను మంత్రి పదవి నుంచి తొలగించండి.. సీఎంకు అభ్యర్థన - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను మంత్రి పదవి నుంచి తొలగించండి.. సీఎంకు అభ్యర్థన

May 27, 2022

తనను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందిగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గంలోని క్రీడాశాఖ మంత్రి అశోక్‌ చాంద్నా ట్విటర్‌ వేదికగా తెలిపారు. సీఎం ప్రధాన కార్యదర్శి(ప్రిన్సిపల్‌ సెక్రటరీ) తీరుతో అసంతృప్తికి గురవుతున్న విషయాన్ని సోషల్ మీడియలో బయటపెట్టారు. గత కొంతకాలంగా తన పరిధిలోని శాఖల్లో.. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కుల్దీప్‌ రంకా జోక్యం మితిమీరిపోయిందని, అన్ని శాఖలకు మంత్రిలాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటప్పుడు ఈ మంత్రి పదవి తనకు వద్దంటూ అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఈ పదవి నుంచి నాకు విముక్తి కల్పించి.. నా శాఖలన్నింటినీ కుల్‌దీప్‌ రంకా కి అప్పగించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నా. ఎలాగూ అన్ని శాఖలకు ఆయనే మంత్రి కదా..!’’ చాంద్నా చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ చాంద్నా ఆరోపణలు.. కాంగ్రెస్‌లో లుకలుకలను మరోసారి బయటపెట్టాయి.