సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు వీరే..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు వీరే..వీడియో వైరల్

July 14, 2020

gncvgn

రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. అతని వెంట ప్రస్తుతం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతులో సచిన్ పైలట్ తో సహా 16మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

ఈ వీడియోను సోమవారం రాత్రి గురుగ్రామ్‌లోని మానెసర్‌ హోటల్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సచిన్ పైలట్ తో పాటు ఉన్న ఎమ్మెల్యేల్లో హరీష్‌ మీనా, ఇంద్రా గుర్జార్‌, ముఖేష్‌ భాకర్‌, పీఆర్‌ మీనా తదితరులున్నారు. అయితే, సచిన్‌‌ వీడియోలో కనిపించలేదు. టూరిజం మినిస్టర్‌ విశ్వేంద్ర సింగ్‌ ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. ఫ్యామిలీ అని క్యాప్షన్‌ పెట్టారు.