Rajasthan old aged couple baby boy born
mictv telugu

పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత సంతానం.. వృద్ధుల సంబరం

August 9, 2022

వారికి పెళ్లయి 54 ఏళ్లు దాటిపోయాయి. అయినా సంతానం కలగలేదు. నోయని నోము లేదు, తిరగని పుణ్యక్షేత్రం లేదు. అతడు భారత ఆర్మీలో పనిచేసి గాయపడి రిటైరయ్యాడు. ఆమె గృహిణి. ఏడు పదుల వయసులో వారి కల ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు. రాజస్తాన్‌లోని జుంజును జిల్లా నుహానియా గ్రామానికి చెందిన గోపీచంద్, చంద్రావతి దంపతుల కథ ఇది. గోపీచంద్‌కు ప్రస్తుతం 75 ఏళ్లు. ఆమెకు కూడా 70 దాటాయి. ఇక పిల్లలు పుట్టరని ఆశ వదిలేసుకున్నారు. అయినా ఓసారి ట్రై చేద్దామని కృత్రిమ గర్భధారణకు సిద్ధపడ్డి వైద్యులను ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో చంద్రావతి గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. రాజస్తాన్‌లో 70 ఏళ్లు దాటిన మహిళ సంతానవతి కావడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు.