దేశంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న దుర్మార్గాలు చివరకు పోలీసులను కూడా చంపేస్తున్నారు. హరియాణా, జార్ఖండ్ లలో మైనింగ్ మాఫియా ఇద్దరు పోలీసులను చంపేసింది. మరోపక్క ఈ అక్రమాలపై నిరసనలు కూడా వెల్లువెత్తున్నాయి. మైనింగ్ వద్దంటూ రాజస్తాన్‌లో ఓ సాధువు ఒంటికి నిప్పు పెట్టుకుని కాలిపోయాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
భరత్‌పూర్‌లోని పసోపా గ్రామలో కొంతమంది సాధువులు అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ ఏడాదిన్నరగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం బాబా నారాయణ్ దాస్ అనే సాధువు టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. బుధవారం హరిదాస్ అనే సాధువు ఒంటిపై కిరోసిన్ చల్లుకుని నిప్పు పెట్టుకున్నాడు. రాధే, రాధే అంటూ జనం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. స్థానికులు అతని ఒంటిపై మంటలు ఆర్పి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
#Rajasthan | Monk sets himself on fire while protesting against illegal mining in #Bharatpur #Video #RajasthanPolice #RajasthanNews #Illegal #Mining #monk #fire #selfimmolation #protest #protesting #India #Indianews #disturbing pic.twitter.com/MX7LTrIOsS
— Free Press Journal (@fpjindia) July 20, 2022