Rajasthan Teacher Changes Gender To Marry Student
mictv telugu

ఇద్దరు ఆడాళ్ల ప్రేమ.. ఆమె మగదైంది.!

November 8, 2022

Rajasthan Teacher Changes Gender To Marry Student

ప్రేమకు కులం-మతం, భాష-ప్రాంతం, ధనిక-పేద బేధాలే కాదు.. లింగబేధం కూడా లేదని నిరూపించి ఓ జంట. ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్లోని భరత్పుర్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మీరా కుంతల్ అనే యువతి నాగ్లా మోతి గ్రామంలోని ప్రభుత్వ సెకండరీ స్కూల్లో పీటీ టీచర్గా పని చేస్తోంది. అక్కడ అమ్మాయిలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుండేది. ఆ సమయంలోనే కల్పన అనే అమ్మాయితో మంచి స్నేహం ఏర్పడింది. ఆమెకు కబడ్డీ ఆట నేర్పడంతో పాటు రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణిగా నిలవడంలో మీరా కీలకపాత్ర పోషించింది. అలా ఆట నేర్పిస్తూనే కల్పనతో ప్రేమలో పడింది మీరా. అయితే మీరా చూడ్డానికే అమ్మాయిలా ఉండేది. మిగతా ప్రవర్తన, లక్షణాలన్నీ కూడా అబ్బాయిలాగే ఉండేవట. ఈ విషయాన్ని మీరా తండ్రి చెప్పాడు.

Rajasthan Teacher Changes Gender To Marry Student

తన సమస్య అందరితో చెప్పుకోలేదని మొదట బాధపడినా.. ఆ తర్వాత మీరాకు మగాడిలా జీవించాలని ఉండేది. సైకియాట్రిస్ట్ ని సంప్రదించగా.. జెండర్ డిస్ఫోరియా అనే వ్యాధి ఉందని తెలిసి లింగ మార్పిడి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. దీనికి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. 2019 డిసెంబర్ 15 నుంచి లింగ మార్పిడి కోసం అనేక సర్జరీలు చేయించుకుని ఆరవ్గా మారాడు. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో నవంబర్ 4న కల్పనను పెళ్లి చేసుకున్నాడు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి ఫోటోలకు ఇద్దరూ సంతోషంగా ఫోజులిచ్చారు.

Rajasthan Teacher Changes Gender To Marry Student