పంజాబ్ ఓటమి.. ప్లే ఆఫ్స్ రేస్‌లోకి రాజస్థాన్! - MicTv.in - Telugu News
mictv telugu

పంజాబ్ ఓటమి.. ప్లే ఆఫ్స్ రేస్‌లోకి రాజస్థాన్!

October 31, 2020

points table

వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ జట్టుకు‌ రాజస్థాన్ షాకిచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. దాంతో ప్లే ఆఫ్స్ రేస్‌లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. పంజాబ్ ఆటగాళ్లలో రాహుల్ (46), గేల్ (99), పూరన్ (22) పరుగులు చేశారు. 

రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ (50), ఉతప్ప (30), శాంసన్(48), స్మిత్ (22) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ తీశారు. ఆల్ రౌండర్ ప్రతిభ కనపరచిన బెన్ ‌స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.