ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అనేది తెలుగులో చాలా మంది వాడే సామెత. అలాంటి సామెతను నిజం చేస్తూ.. తన పెళ్లి వేడుక సందర్భంగా మూగ జీవాలకు మూడు రోజులపాటు ఆహారాన్ని అందించింది ఓ వధువు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన డింపుల్ భస్వర్ అనే యువతి.. తన వివాహా వేడుకలో వీధి కుక్కలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసి స్థానికులు నివ్వెరపోయారు.
తన పెళ్లి సందర్భంగా మూగజీవాలైన ఆవులు, కుక్కలు, పక్షులు తదితరల వాటి కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయించింది. మూడు రోజులపాటు ఆ మూగ జీవాలకు ఆహారాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. పెళ్లికొచ్చిన బంధువులు కూడా ఆ కుక్కలకు ఆహారాన్ని అందిస్తారని చెప్పింది. కరోనా సమయంలో ఉదయ్‌పూర్ ఎనిమల్ ఫీడ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించిన డింపుల్.. మూగజీవాలకు హాని తలపెట్టవద్దనే కొటేషన్లను డింపుల్ తన పెళ్లి పత్రికపై అచ్చు వేయించింది.