Rajasthan woman ties rakhi to ailing leopard, pic Goes viral
mictv telugu

చిరుతకు రాఖీ కట్టిన మహిళ

August 12, 2022

Rajasthan woman ties rakhi to ailing leopard, pic Goes viral

రక్షాబంధన్ అనగానే సోదరసోదరీమణులు రాఖీ కట్టి, మిఠాయిలు పంచుకొని పండుగను ఆనందంగా జరుపుకుంటారు. కానీ ఓ మహిళ జంతువుకు రాఖీ కట్టింది. అది కూడా ఏకంగా చిరుత పులికి. అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్న ఆ చిరుత పులికి మ‌హిళ రాఖీ క‌డుతున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయింది. ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నందా ఈ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.

ఈ వైర‌ల్ ఫోటోలో అస్వ‌స్ధ‌త‌తో బాధ‌పడుతున్న చిరుత పులికి మ‌హిళ రాఖీ క‌డుతూ క‌నిపించింది. రాజ‌స్ధాన్‌లో ఓ మ‌హిళ వ‌న్య‌ప్రాణి ప‌ట్ల‌ బేష‌ర‌తు ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అస్వ‌స్ధ‌తతో కూడిన చిరుత‌ను అట‌వీ శాఖ‌కు అందించే ముందు దానికి రాఖీ క‌ట్టార‌ని, వ‌న్య‌ప్రాణుల ప‌ట్ల ప్రేమ‌, సోద‌ర‌భావాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటోను షేర్ చేస్తూ సుశాంత నంద పేర్కొన్నారు. వ‌న్య‌ప్రాణి ప‌ట్ల మ‌హిళ చూపిన ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను ఇంట‌ర్‌నెట్ స్వాగ‌తిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టగా, చిరుత‌కు రాఖీ క‌ట్ట‌డం ప్రేమ, ఆప్యాయ‌త‌కు సంకేత‌మ‌ని మ‌రో యూజ‌ర్ ప్ర‌శంసించారు. దేవుడు ఎన్నో జీవుల‌ను సృష్టించారని, ప్రపంచం కేవ‌లం మ‌నుషుల‌కే కాద‌ని మ‌రో యూజ‌ర్ రాశారు.