ప్రపంచమా చూడు..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచమా చూడు..!

July 31, 2017

నీకు సభ్యతనూ సంస్కారాన్నీ నేర్పిన ఒక మహా సంస్కృతి చేస్తున్న నగ్ననాట్యాన్ని చూడు. ప్రపంచానికి తలమానికాన్ననీ, మానవ సంస్కృతికి మహాపీఠాన్ని అని గొంతుచుంచుకునే ఈ ద్వీపకల్పపు దివ్యావస్థను చూడు.

ప్రదేశం: రాజస్థాన్

ఆమె ఒక వివాహిత. భర్తంటే ఇష్టం లేదు. ప్రియుడితో ఇంటినుండి పారిపోయింది. భర్తకానీ, తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యకుండా సొంతగా వెతకడం మొదలు పెట్టి నెల తరవాత గుజరాత్ లో పట్టుకున్నారు. అక్కడినుండి రాజస్థాన్లోని స్వగ్రామానికి తెచ్చి పంచాయితీ పెట్టారు.

పంచాయితీలో భారత సంస్కృతి బట్టలిప్పుకుని భాంగ్రా చేసింది. ఇద్దరూ చేసింది ఘోరాపరాధంగా ప్రకటించి వివస్త్రలను చేసి వూరంతా వూరేగించాలని తీర్పు చెప్పేసింది. ఇక నీతిమంతుల, సంస్కారవంతుల గుంపు ,డప్పులూ కర్రలు తీసుకుని ఇద్దర్నీ ఒకరిచేత ఒకర్ని మోపిస్తూ నగ్నంగా బజారు బజారుకూ తిప్పింది. చివర్లో పెళ్ళిద్వారా ఆమెమీద హక్కు పొందిన భర్తగారు.. వాళ్లను రెండ్రోజులు నడివీధిలో చెట్టుకు కట్టేసి నగ్నంగా నిలబెట్టాడు.చివరికి వాళ్లు  ప్రాధేయపడగా… వాళ్లతో తమను ఎవరూ హింసించలేదని రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకుని వదిలి పెట్టారు… దయామయులు.

ఇదీ నాదేశం…. ఇదీ నా న్యాయం…. ఇదీ నా నీతి…. ఇదీ నా సంస్కృతి…. ఇదీ నా మతం….!