“ఈ సాలా నమదే” అంటూ మరోసారి ఐపీఎల్ -2023లో అడుగుపెడుతోంది ఆర్సీబీ. ఈ సారైనా ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది. కానీ కాలం మాత్రం ఆర్సీబీకి కలిసి రావడం లేదు. టోర్నీ ప్రారంభానికి ముందే వరుస ఎదురుదెబ్బలు తగులు తున్నాయి. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవుతున్నారు. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన విల్ జాక్స్ ఇప్పటికే గాయంతో ఐపీఎల్‌ను వీడాడు. అతడితో పాటు మరికొందరు కీలక ప్లేయర్స్ గాయాలతో బాధపడుతున్నారనే వార్తలు ఆర్సీబీని కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి.
2008 ఐపీఎల్ నుంచి నేటీ వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ ట్రోఫీని గెలవలేకపోయింది.ప్రపంచంలో పేరుగాంచిన బ్యాటర్లు, హిట్టర్లు తరఫున ఆడిన కప్పు కొట్టడంలో విఫలమైంది. గతంలో పేలవ ప్రదర్శనను మూటగట్టుకుంది. తాజా సీజన్‌లో మాత్రం పేపర్‌పై జట్టు బలంగా కనిపిస్తోంది. వేలంలో కోట్లు ఖర్చు చేసి కీలక ప్లేయర్స్‌ను సొంతం చేసుకుంది. అంతా బాగుంది అన్నకున్న సమయంలో గాయాలు వెంటాడుతున్నాయి.
ఇప్పటికే విల్ జాక్స్ దూరమైపోయాడు. అలాగే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌లు గాయాలతో అన్నీ మ్యాచ్ లు ఆడే పరిస్థితి కనబడట్లేదు. ఇంతలో మరో వార్త ఆర్సీబీని ఉలిక్కిపడేలా చేసింది. ఆర్సీబీ కీలక బ్యాటర్ రజత్ పటీదార్ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్‌లో అతడు కనిపించడం లేదు. పటీదార్ కు మడమకు గాయం కావడంతో అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ గాయం కారణంగా అతడిని మూడు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా ఆర్సీబీ ఆడే సగం మ్యాచ్ లకు పటీదార్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో రజత్ పటీదార్ సెంచరీతో చెలరేగాడు.