తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు మేకర్స్. తమ సినిమాను చూస్తే డైరెక్ట్ హీరో, హీరోయిన్స్ కలిసే ఛాన్స్ ఉంటుందని , లేదంటే లక్కీ డ్రా లో ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చని ఇలా రకరకాలుగా ప్రకటనలు ఇస్తుంటారు. తాజాగా టాలీవుడ్ మూవీ రాజయోగం యూనిట్ .. తమ సినిమాని చూస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే ఓ కండిషన్ పెట్టింది.
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “రాజయోగం” . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..’మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రానికే అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే లక్ష రూపాయల బహుమతి ఇస్తాం.’ అని ప్రకటించారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..’సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కష్టానికి ఫలితం దక్కినట్లు అనిపిస్తోంది. నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాం. రాజయోగం చిత్రాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి :
బుద్దుందా నీకు.. మైక్ దొరికిందని మతి లేకుండా వాగొద్దు..!
క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు.. పుట్టపర్తిలో న్యూ ఇయర్
బూతులు తిట్టి.. సిగ్గులేకుండా ఇంటికి వస్తే ఎలా ?