అసలు వీడు పెళ్లెందుకు చేసుకున్నాడు? - MicTv.in - Telugu News
mictv telugu

అసలు వీడు పెళ్లెందుకు చేసుకున్నాడు?

December 4, 2017

తొలిరాత్రే నవవధువు శైలజను తీవ్ర చిత్రహింసలు పెట్టి కాళరాత్రి చూపించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేశ్ కేసులో విస్మయం కలిగించే విషయాలు బయటికొస్తున్నాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన ఇతడు తాను నపుంసకుడినన్న విషయాన్ని దాచేసి రూ. 20 లక్షల కట్నం తీసుకుని ఇతడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.పోలీసు విచారణలో ఇతడు తొలిరాత్రి భార్యను చిత్రహింసలు పెట్టడానికి కారణాలు తెలిపాడు. ‘నా లోపం గురించి చెప్పొద్దని ఆమెను ఎంతో బతిమాలుకున్నాను.. కాళ్లు పట్టుకున్నాను..  కావాలంటే నువ్వు వేరే మగవాళ్లతో కోరికలు తీర్చుకో అని కూడా ఆఫర్ ఇచ్చాను. ఈ ప్రపంచంలో సంసారానికి పనికిరాని మగవాళ్లు ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారని, వాళ్ల భార్యలు వారి చక్కగా వేరే వాళ్లతో కోరికలు తీర్చుకుంటున్నారని అని వివరించాను. నువ్వు కూడా అలా చెయ్యిచ,  నాకేం అభ్యంతరం లేదని చెప్పానున. నేను కోరేదల్లా ఒకటే.. నా లోపం గురించి ఎవరికీ చెప్పకు.. మనం చక్కగా కాపురం చేసుకుందాం. నీకు ఏ లోటూ రానివ్వను.. నీ కాళ్లు పట్టుకుంటా అని ఎంతో బతిమాలాను. ఇంత చెప్పినా.. ఆమె వినకుండా బయటికెళ్లి.. నేను మగవాడిని కాదని చెప్పింది. మళ్లీ లోపలి వచ్చాక.. నాకు పట్టలేని కోపం వచ్చింది. అందుకే కొట్టాను.. ’ అని అతడు తెలిపాడు. తొలిరాత్రి తానున  మనో వేదనను అనుభవించానని, శైలజ అసలు విషయం బయటికి చెప్పడం వల్లే దాడి చేశానని తెలిపారు.

రాజేశ్ ను కఠినంగా శిక్షించాలని శైలజ డిమాండ్ చేస్తోంది. లోపాన్ని కప్పిపుచ్చి ఎందుకు పెళ్లిచేసుకున్నాడని ఆమె బంధువులు రాజేశ్‌పై మండిపడుతున్నారు.