ఎన్ని సార్లు చెప్పినా.. ఏమీ చెప్పనట్లేనా... - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్ని సార్లు చెప్పినా.. ఏమీ చెప్పనట్లేనా…

June 17, 2017


ఈ భాష ఎన్ని సార్లు చెప్పినా చెప్పనట్లే… వంద సార్లు చెప్పినా ఒక్క సారి కూడా చెప్పనట్లే…. ఎన్ని సార్లు… ఎన్ని తీర్ల చెప్పినా ఏదో ఒకటి చెప్పినట్లే… ఏమీ చెప్పనట్లే… అచ్చం ఇట్లనే ఉంది తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కండిషన్. సార్ పార్టీ పెడ్తారని…. అభిమానులతో భేటీ అయినప్పుడు సునామీలా వార్తలు చుట్టు ముట్టాయి. అంతా అయ్యాక ఈ మాణిక్ భాష తుస్స్ మన్నారు. తాజాగా ఈ యేడాది డిసెంబర్ లో పార్టీ ప్రకటిస్తారని మల్లో సారి మేరినా బీచ్ అదిరిపోయేలా వార్తలు వస్తున్నాయి. రాజనీ కాంత్ పై సిన్మా రంగానికి చెందిన వారే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో సెట్ బ్యాక్ అయ్యాడని కూడా అప్పట్లో వార్తలు గుప్పమన్నాయి. అయితే రజనీని ఆదేవుడు ఆశిస్తే…. ఈయన ఆచరిస్తాడనుకుంటే…. ఈయన కంటే ముందు కాంగ్రెస్ పార్టీలున్న ఈయన స్నేహితుడు ముందే పార్టీ ముచ్చట కుల్లంకుల్లం చెప్పాడు. పార్టీ జెండా ఎజెండా ఎట్లా ఉండాలి…ఓటర్లను ఎట్లా ఆకట్టు కోవాలి… అనే విషయాలపై బెంగుళూరుకు చెందిన ఓ ఎజెన్సీ అన్ని పక్కగా ప్లాన్ చేస్తున్నదట. తెరవెనుక పనులు కంప్లీట్ చేసుకుని ఈ రోబో…. కబాలిరా…అనుకుంటూ జనం ముందుకొస్తాడట.