తలైవా రజనీకాంత్ కొత్త సినిమాకి ‘కాలా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత ధనుష్ తన ట్విటర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు.‘కబాలి’తర్వాత మళ్లీ పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రాన్ని ధనుష్ తన వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీగానటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం సమకూరుస్తున్న కాలాను 2018లో రిలీజ్ చేస్తారు.
Wunderbar films presents .. superstar Rajinikanth in and as #thalaivar164 pic.twitter.com/rUrMWCYNkJ
— Dhanush (@dhanushkraja) May 25, 2017