సీఏఏపై స్పందించిన రజినీ..ఏమన్నారంటే - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏపై స్పందించిన రజినీ..ఏమన్నారంటే

February 5, 2020

dfgbnm

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చటం(సీఏఏ)పై నటుడు రజినీకాంత్ స్పందించారు. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవతానని హామీ ఇచ్చారు. విభజన తర్వాత భారత్‌లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజినీ చెప్పుకొచ్చారు. 

అయితే కొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. అలాగే బయటి వ్యక్తులను గుర్తించేందుకు ఎన్‌పీఆర్ చాలా ముఖ్యమైనదని రజినీ తెలిపారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ మీడియాతో స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత డిసెంబరులో సీఏఏపై పరోక్షంగా స్పందించిన రజనీ.. దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక ఆందోళనలపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.