హిమాలయాల్లో రజినీ  ఆశ్రమం - MicTv.in - Telugu News
mictv telugu

హిమాలయాల్లో రజినీ  ఆశ్రమం

October 26, 2017

సూపర్ స్టార్ రజినీకాంత్ హిమాలయాలకు అప్పుడప్పుడు వెళ్లి యోగా చేసుకుంటారు. అందుకోసం ఆయన తన మిత్రులతో కలసి హిమాలయాల్లో ఓ ఆశ్రమంను నిర్మించారు.

2002లో దునగిరి ప్రాంతంలోని గుహలో యోగా చేసుకునేందుకు  వెళ్లిన రజినీకి, ఛైన్నైకి చెందిన వి. విశ్వనాథన్, బెంగళూర్‌కు చెందిన విఎస్.హరి, విఎస్ మూర్తి, ఢిల్లీకి చెందిన శ్రీధర్‌రావులతో పరిచయం ఏర్పడి  స్నేహంగా మారింది.  వీరితో కలసి రజినీ హిమాలయాలో ఆశ్రమాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు.

పరమహంస యోగానంద స్థాపించబడిన ‘యోగోద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ’ సంస్థ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా, ఈ ఆశ్రమాన్ని స్థాపించినట్టు తెలిపారు. ఈ ఆశ్రమానికి దాదాపు  కోటి రూపాయలు  ఖర్చు అయినట్టు రజిని మిత్రులు తెలిపారు.  ఈ ఆశ్రమం నవంబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచిత సౌకర్యాలను కల్పించనున్నట్లు రజినీ స్నేహితులు  తెలిపారు.