ముఖ్యమంత్రి పాత్రలో రజనీకాంత్…

సినిమాల్లోంచి రాజకీయాలలోకి వచ్చి సీఎం అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అలా సినిమాల్లో నటించి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టినవారు కూడా ఉన్నారు. కోన్ని రాజకీయ మూవీలలో యాక్ట్ చేసి , కొంత అవగాహన ఏర్పరచుకోని రాజకీయాల్లోకి వస్తున్నారు సిని సెలబ్రెటిస్. ఇప్పుడు ఆ దారిలోనే ఉన్నారు సూపర్ స్టార్ రజనికాంత్. తమిళనాడులో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రికి రంగం సిద్దమవుతోంది. ఈ టైమ్ లో ‘ముదల్వన్’ వంటి కథతో జనాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని రజనీ గుర్తించారట. దానితో డైరెక్టర్ శంకర్ రజనీ గుణ గణాలు,లక్షణాలు , రజనీ సీఎం అయితే ఎలా ఉంటుందనే విషయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేసే విధంగా ఈ మూవీని తిస్తున్నారట. ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేయడం విశేషం.

తమిళనాడులో ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి వాళ్లు సినిమాల్లో నటించి, రాజకీయల్లోకి వచ్చి సీఎం పదవిని చేపట్టినవారే ఇప్పుడు అదే సిట్యువేషన్ క్రియేట్ అవుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయంగా రజనీకాంత్ , కమల్ హసన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఈ సమయంలో ఓ మూవీలో రజనీకాంత్ ముఖ్యమంత్రి పాత్ర లో కనిపిస్తాడనే వార్త వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

 

SHARE