పాకిస్థాన్‌లో రజనీకాంత్..! - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్థాన్‌లో రజనీకాంత్..!

November 4, 2022

పాకిస్థాన్‌లో తలైవా రజనీకాంత్ దుమ్మురేతున్నాడు. బౌన్సర్లు లేకుండా చక్కర్లు కొడుతున్నాడు. రోడ్డున పోయేవాళ్లంతా సెల్ఫీలు దిగుతున్నారు. సూపర్ స్టార్‌ని గుర్తుపట్టి మరి పలకరిస్తున్నారు అభిమానులు .రోడ్డుపై హాయిగా తిరుగుతే సెక్యూరిటీ ప్రాబ్లమ్ రావడం లేదనుకుంటున్నారా?

క్రేజీ స్టార్

సెలెబ్రిటీ రోడ్డెక్కితే జనం గోలగోల..తమతోపాటు నడిచివెళ్తుంటే..క్షణాల్లో వేలాదిమంది పోగవుతారు. అదీ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ అయితే.. క్రౌడ్ ఓ రేంజ్‌లో ఉంటుంది..పాకిస్థాన్‌లో అయితే రజనీకాంత్ హాయిగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారు. ఎందుకంటే రీల్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు..రియల్ స్టార్ రజనీకాంత్ అలియాస్ రెహ్మాత్ గాస్‌ఖోరీ.మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు.నిజమే అచ్చం రజనీకాంత్‌లాగే ఉంటాడు రెహ్మాత్. స్టయిల్ , వేషధారణ అచ్చం అలాగే ఉంటుంది. ఇతను కనిపిస్తే రజనీకాంత్ అని పిలుస్తారట. చాలా మంది ఇతనితో సెల్ఫీలు దిగుతారట.

 

రిటైర్డ్ ఉద్యోగి

ఈ రజనీకాంత్ ది పాకిస్థాన్. కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. 62 ఏళ్ల వయస్సు..రిటైర్ట్ అయ్యాక సోషల్ మీడియాలో యమయాక్టివ్ అయ్యాడు. చూడటానికి రజనీకాంత్‌లా ఉండటంతో తక్కువ టైమ్‌లో ఫాలోవర్లు పెరిగారు. అసలు పేరుకంటే సూపర్ స్టార్ పేరుతోనే ఎక్కువమంది పిలుస్తున్నారు. ఇతను రజనీ స్టైల్ ఫొటోల్ని తరచుగా పోస్ట్ చేస్తుంటాడు. కొన్ని ఛానళ్లు ఇతనితో ఇంటర్వ్యూలు కూడా చేశాయి.

దేవుడిచ్చిన వరం

“అవును నేను సూపర్ స్టార్ రజనీకాంత్ నే.కాకపోతే నాది పాకిస్థాన్. భారత్ ,బంగ్లాదేశ్, సౌదీకి చెందిన వాళ్లు నా చిత్రాల్ని షేర్ చేస్తారు. నిజంగా ఆయనలా ఉండటం ఆనందంగా ఉంది” అని అతను అంటున్నాడు.రజనీలా ఉండటం దేవుడిచ్చిన వరమని పాకిస్థాన్ వాసి చెబుతున్నాడు.