నటుడు రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఆయన కొత్త పార్టీ పెడతాడని కొన్ని రోజులు.. లేదు ఆయన బీజేపీ పార్టీలో చేరుతారని కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. కానీ, రజినీకాంత్ ఆ వార్తలపై స్పందించలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతుంది. డాక్టర్ల సూచన మేరకు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం అనే ఆలోచనను విరమించుకున్నారని ఆ లెటర్ ఉంది.
దీనిపై రజినీకాంత్ స్పందించారు. ఆ లెటర్ గురించి తనకు తెలియదన్నారు. కానీ, ఆరోగ్య సమస్యలు మాత్రం నిజమని తెలిపారు. అలాగే సరైన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలతో చర్చించి రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. ‘నాకు 2016లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అప్పట్లో నాకు సలహా ఇచ్చారు.’ అని రజనీకాంత్ తెలిపారు. అది డాక్టర్ల సలహా మాత్రమేనని, రాజకీయాల్లోకి తాను వెనక్కి పోలేదని స్పష్టం చేశారు.