తమిళ సూపర్ స్టార్ తలైవా కొత్త పార్టీ పెట్టబోతున్నాడా?రజనీ రాజకీయాల్లోకి పూర్తిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?15 రోజుల్లో తమిళనాడులో రజనీ పార్టీ జెండా ప్రజల్లోకి రాబోతుందా? ఏమో మరి తమిళనాడు పరిస్ధితి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇంకో పదిహేను రోజుల్లో రజనీ కాంత్ కొత్త పార్టీ పెడతారని ధీమాతో చెప్పారు గాంధేయ ఉరుమై ఇయక్కం అధ్యక్షుడు తమిళురువి మణియన్.ఆయన ఈమద్య రజనీనీ రెండు సార్లు కలిసి రాష్ట్రంలో ఉన్నరాజకీయ పరిస్ధితులను వివరించారట.
అవినీతి రహిత పారదర్శక పరిపాలన .రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే భావనతోనే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఆయనకు ఉందని, రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని తనతో చెప్పారని తెలిపారు. తాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసం రావాలని అనుకోవడం లేదని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నానని రజినీకాంత్ పలుమార్లు తనతో చెప్పారని మణియన్ గుర్తు చేశారు.మరి సూడాలే మణియన్ చెప్పినట్టు రజనీ 15 రోజుల్లో తను పెట్టవోయే కొత్తపార్టీ గురించి అనౌన్స్ చేస్తారా లేదా అనేది.