పెరియార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను.. రజినీ - MicTv.in - Telugu News
mictv telugu

పెరియార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పను.. రజినీ

January 21, 2020

Rajinikanth.

ప్రముఖ నటుడు రజనీకాంత్ ద్రవిడ ఉద్యమనేత రామస్వామి పెరియార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 14న రజనీ తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్‌ సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్త పడిందని పేర్కొన్నారు. ఈ వార్తను కేవలం ఒకే ఒక్కతమిళ మేగజైన్‌ ప్రచురించిందని పేర్కొన్నారు. 

దీనిపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోవై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రజినీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే రజనీ తన ఇంటి బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెరియార్‌ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పనన్నారు. ‘1971లో ఏం జరిగిందో నేను చెప్పినదానిపై చర్చ జరుగుతోంది. అప్పుడు ఏం జరిగిందో మ్యాగజైన్‌లో వచ్చిన కథనాలను బట్టే నేను చెప్పాను. కానీ సొంతగా ఊహాజనిత విషయాలేవీ నేను చెప్పలేదు. వాటికి సంబంధించిన క్లిప్లింగ్స్‌ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ ఘటన గురించి నేనేమి చూశానో అదే చెప్పాను. దీనికి నేను క్షమాపణ చెప్పను’ అని రజనీకాంత్‌ అన్నారు.