రావయ్యా రజనీ..లేట్ చేయకు..ఈ తంబిలు ఆగట్లేదు. - MicTv.in - Telugu News
mictv telugu

రావయ్యా రజనీ..లేట్ చేయకు..ఈ తంబిలు ఆగట్లేదు.

June 1, 2017

అనౌన్స్ మెంట్ రాలేదు. ప్లాట్ ఫామ్ నెంబర్ తెలియదు..ట్రైన్ నెంబర్ ఎంతో అసలే తెలియదు..అయినా అప్పుడే కొందరు బెర్త్ కోసంట్రై చేస్తున్నారు. రావడం పక్కా గానీ ఎప్పుడు వస్తుందో తెలియని కబాలి ఎక్స్ ప్రెస్. దీని కోసం తమిళ తంబిలు లక్ష కళ్లతో ఎదురు చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా ట్రైన్ ఎక్కడానికే రెడీ అయిపోయారంట..వాళ్లెవరంటే…
తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే చర్చ.సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. జూలైలో పార్టీ ప్రకటన నిజమేనా..ఆయన్నొస్తే ఎవరెవరు ఆయన వెంటనడుస్తారు. అనేవి పొలిటికల్ సర్కిల్స్ లో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. టైమ్ వచ్చినప్పుడు పోరుకు సిద్ధం కండని కబాలి పిలుపు తమిళనాట హీట్ ని పెంచింది.
నిజంగా రజనీ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు పొలిటికల్ పిక్చర్ టోటల్ గా మారిపోతుంది. అందులో నో డౌట్. దేవుడు ఆదేశిస్తే రజనీ చేస్తాడో లేదో గానీ…ఈ భాషా చెబితే కోట్లాది మంది అభిమానులు కదులుతారు. ఆయన వేలెత్తి చూపినవైపు నడుస్తారు. అభిమానమే ఉప్పెనై బ్యాలెట్ బాక్స్ ను బద్దలు చేయడం కన్ ఫామ్ .అందుకే ఇంకా రాని ..ప్రకటించని రజనీ రైలు కోసం తమిళనేతల ఎదురుచూపులు.
రజనీ మేనియా అధికారిక అన్నాడీఎంకే పాటు అన్ని పార్టీలను షేక్ చేస్తోంది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల్ని అసలు నిలవనీయడం లేదు. కొంతమంది పార్టీ ప్రకటన వచ్చేదాకా కూడా ఆగలేకపోతున్నారట. అంతలా రజనీ మేనియా వారిని నడిపిస్తుంది. పార్టీ ప్రారంభిస్తే అందులో చేరడానికి ఐదుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు రెడీగా ఉన్నారనే ప్రచారం కలకలం రేపుతోంది.రజనీ పిలుపుకు తోడు ఇటీవల గాంధీ ప్రజా సంఘం అధ్యక్షుడు దమిళరువి మణియన్‌ రజనీకాంత్‌ను కలిసి అనంతరం ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం తథ్యం అని రజనీకి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.. ఆయన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల రజనీకాంత్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు రజనీ పార్టీ పెడితే అందులో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది
ఇక పన్నీర్‌సెల్వం, ముఖ్యమంతి ఎడపాడి పళనిస్వామి వర్గాలకు చెందిన పలువురు కార్య నిర్వాహకులు రజనీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు రజనీతో సంప్రదింపులు జరపడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాలా షూటింగ్‌ కోసం ముంబైలో మకాం పెట్టిన రజనీకాంత్‌ వీరెవరినీ కలవడానికి సుముఖం వ్యక్తం చేయడం లేదట. కానీ కాలా కాగానే భాషా పొలిటికల్ లైన్లోకి వస్తే తమిళనాట దబిడు దిబిడే..అన్నాడీఎంకే, డీఎంకే ఢమాలే. అసలే శూన్యంతో నిండిన తమిళరాజకీయాల్లో ఈ హీరో సునామీయే..రావయ్యా రజనీ..లేట్ చేయకు..ఈ తంబిలు ఆగట్లేదు.