ఉచిత సలహాలొద్దు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉచిత సలహాలొద్దు..!

June 24, 2017

రజనీ ఒక్కసారి చెబితే..వందసార్లు చెప్పినట్టు.దేవుడు శాసిస్తే ఈ రజనీ పాటిస్తాడు.ఇలా రీల్ పై సూపర్ స్టార్ కు తిరుగులేదు. ఎవరూ ఈ రీల్ సామ్రాట్ ని క్రాస్ చేయలేరు. దరిదాపుల్లోకి కూడా రాలేరు. మరి రియల్ లైఫ్ రాజకీయాల్లోకి వస్తే హిట్టా..ఫట్టా..?బాషా ఎంటరైతే తమిళపార్టీలన్ని మటాషేనా…తమిళనాట జయలలిత, కరుణానిధి లేని లోటు తీరుస్తారా..?తొందరపడి రాజకీయాలకు పనికిరాడని ముందే కొన్ని కోయిలాలు ఎందుకు కూస్తున్నాయి..?

రజనీ మాటలో మేజిక్. ఆయన దారి కోట్లాది తమిళ తంబిల దారి.ఆయన వెలెత్తి చూపినవైపు కోట్ల అడుగులు పడుతాయి. ఇందులో నో డౌట్..రీల్ లైఫైనా రియల్ లైఫ్ లోనైనా ఇదే సీను. పాలిటిక్స్ లోకి ఎంటరైతే తమిళనాట ఈక్వేషన్స్ గ్యారంటీగా మారిపోతాయి. అమ్మా, కరుణ లేక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారికి రజనీ అన్న అవుతాడు. అన్నీ తానై నడిపిస్తాడు.ఇదే ఇప్పుడు కొందరికి నచ్చడం లేదు. అందుకే రజనీ రాజకీయాలకు సూట్ కాడని, పనికిరాడని యాక్టర్ కమల్ హాసన్ , ఎంపీ సుబ్రమణ్యస్వామిలాంటోళ్లు కూస్తున్నారు.

సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో మరోసారి అభిమానులతో సమావేశమై రాజకీయ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకుంటానని, అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానంటూ ఇటీవల రజనీకాంత్‌ చెప్పారు. కానీ కొందరు స్టార్స్ , నేతలు ఆగడం లేదు. ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏమన్నాడంటే ‘రజనీ నిరక్షరాస్యుడు. ఆయన రాజకీయాలకు సరిపోరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో రజనీకి తెలియదు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే హానికరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రాజకీయాల్లో రావద్దనే నేను ఆయనకు సలహా ఇస్తా’ అంటూ కాంట్రావర్సీ స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు.

స్వామి నీ ఉచిత సలహాలు మీ పార్టీవాళ్లే వినరు. మిగతా వారు వింటారా… సరే మీరన్నట్టు రజనీ నిరాక్షరాస్యుడే అనుకుందాం.మరి అప్పట్లో ఆయన్ను లాగేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నాలు చేసింది. వంగి వంగి దండాలు ఎందుకు పెట్టింది. అయినా కోలీవుడ్ నుంచి వచ్చిన అందరూ తమిళ పాలిటిక్స్ లో హిట్ అయ్యారు. ఇలాగే సూపర్ స్టార్ కు తిరుగు ఉండదు..తంబిలు కూడా అదే ఫీలింగ్ తో ఉన్నారు. మీకు అంతో ఇంతో దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఉచిత సలహాలు ఇచ్చి దాన్నేందుకు ఖరాబ్ చేసుకుంటారు..