Rajiv Gandhi assassination case: Supreme Court orders release of all 6 convicts
mictv telugu

రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీం కీలక తీర్పు

November 11, 2022

Rajiv Gandhi assassination case: Supreme Court orders release of all 6 convicts

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. 2022 మే 18న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానం మిగిలిన దోషుల విషయంలో కూడా వెల్లడైందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం దోషులను విడుదల చేసేందుకు సుముఖత చూపడం, సోనియాగాంధీ కుటుంబం కూడా సానుకూలత చూపడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఆరుగురు దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

తమను విడుదల చేయాలంటూ పలుమార్లు దోషులు నళిని శ్రీహర్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ కోర్టులను ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని కీలక తీర్పు ఇచ్చింది.

ఇక, రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో 1999 మేలో పెరారివాలన్‌, మురుగన్, శాంతమ్, నళినికి మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో 11 ఏండ్లు ఆలస్యం కావడంతో సంతన్, మురుగన్, పెరారివాలన్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది సుప్రీం.