రాజీవ్ గాంధీ హంతకురాలి నిరాహారదీక్ష  - MicTv.in - Telugu News
mictv telugu

రాజీవ్ గాంధీ హంతకురాలి నిరాహారదీక్ష 

October 26, 2019

Rajiv Gandhi nalini hunger strike 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని తన విడుదల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టుల ద్వారా పని జరగదని భావించిన ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. వేలూరు జైల్లో ఉన్న నళిని శుక్రవారం రాత్రి నుంచి తిండి మానేసినట్లు జైలు అధికారులు చెప్పారు. తనను విడుదల చేయాలనే డిమాండుతో దీక్ష చేపడుతున్నట్లు ఆమె అధికారులకు లేఖ కూడా రాసింది. 

‘నేను, నా భర్త మురుగన్ 28ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాం. ఇకనైనా మమ్మల్ని విడుదల చేయాలి.. ’ అని ఆమె కోరింది. నళిని ఈ డిమాండ్‌తో దీక్షకు దిగడం కొత్తమీ కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ భర్తతో కలసి నిరశనకు దిగింది. కూతురి పెళ్లి కోసం ఆమె ఇటీవలే నెల రోజులు పెరోల్‌పై బయటికి వచ్చింది. తర్వాత తన మామ ఆరోగ్యంతో ఉన్నాడని, తనను బయటికి పంపాలని కోరింది. మరోపక్క  రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని సమా ఏడుగురిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్ని యత్నాలూ చేస్తోంది. గవర్నర్‌కు లేఖ రాసింది. ఆయన స్పందించకపోవడంతో నళిని మళ్లీ దీక్షకు దిగింది.