హైదరాబాద్ నగరంలో ఇల్లును కొనాలని ఎదురుచూస్తున్న వారికీ హెచ్ఎండీఏ శుభవార్త తెలిపింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. బండ్లగూడ, నాగోల్లోని సహ భావన టౌన్షిప్ 15 టవర్లో మొత్తం 2,246 ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని వెల్లడించింది. ఇందులో చదరపు గజం కనీస ధర రూ. 2,200 నుంచి రూ. 2,700గా నిర్ణయించారు. అలాగే, ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్ షిప్ 8 టవర్లో ఏకంగా 576 ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చదరపు గజం రూ.1,500 నుంచి 2,000 వరకు నిర్ణయించారు.
అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వారు మార్చి 22వ తేదీ వరకు అవకాశం ఉందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది. రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా రూ.11,800 చెల్లించాల్సి ఉంటుందని, వచ్చే నెల 24వ తేదీ ఇళ్ల వేలం ఆన్లైన్లో నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.