భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

May 12, 2022

భారత ఎన్నికల సంఘానికి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో మే 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా భాద్యతలు స్వీకరించనున్నారు.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్… బీహార్‌, జార్ఖండ్ కేడ‌ర్ అధికారిగా త‌న వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆర్బీఐ, సెబీ, నాబార్డ్‌ల‌లో డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2020 సెప్టెంబర్ లో కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా పని చేశారు.