ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు మళ్లీ వేలానికి వచ్చాయి. బండ్లగూడ, పోచారంలలోని ఫ్లాట్లను హెచ్ఎండీఏ మళ్లీ వేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసంది. టోకెన్ అమౌంట్ చెల్లించడానికి ఆఖరు తేదీ జనవరి 18. ఇటీవల వీటికి నిర్వహించిన వేలంలో కొన్ని ఫ్లాట్లు అమ్ముడుబోలేదు. వీటిలో 1 బీహెచ్కే, 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఉన్నాయి. టోకెన్ అడ్బాన్సు చెల్లించేవారికి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయిస్తారు. www.hada.in, www.sawgruha.telangana.gov.in వెబ్సైట్లలో ప్లాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. 1 బీహెచ్కేకు రూ. 1 లక్ష, 2 బీహెచ్కేకు రూ. 2 లక్షలు, 3 బీహెచ్కేకు రూ. 3 లక్షలు టోకెన్ అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉంటుంది.
‘ఏ స్థితిలో ఉన్నవాటిని ఆ స్థితి’లో వేలం వేస్తున్నారు. 1 బీహెచ్కే ఇంటి ధర 25 లక్షలకుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ధరలు ఎంచుకునే ఇంటిని బట్టి, పూర్తయిన పనులను బట్టి ఉంటుంది. ఇదివరకు బండ్లగూడ ఫ్లాట్లను వేలం వేసినప్పుడు పనులు పూర్తయిన ఇంట్లో చదరపు అడుగుకు 3 వేలు, సగం పూర్తయిన ఇంట్లో చదరపు అడుగుకు 2,750గా ధర నిర్ణయించారు. ఇప్పుడు మారి ఉండొచ్చు.