ఒక వయసు వచ్చాక గుండె జబ్బులు రావడం మామూలే. కానీ 8వ తరగతిలో చదువుతున్న ఒక విద్యార్థిని ఈరోజు గుండెపోటుతో మరణించింది. ఇందుకు కారణం పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
రాజ్ కోట్ లోని శ్రీ అమృతలాల్ విర్చంద్ జసాని విద్యామందిర్ లో రియా సోని 8వ తరగతి చదువుతున్నది. రోజులాగే ఈ రోజు కూడా స్కూల్ కి వచ్చింది. అయితే ప్రిన్సిపాల్ స్మితాబెన్ ప్రకారం.. రియా సోని పాఠం వింటూ బెంచ్ మీదే పడిపోయింది. ఆమె కోలుకోవడానికి సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమె చేతులు, కాళ్లను రుద్దారు. కానీ లాభం లేకుండా పోయింది.
లేఖలో..
శ్రీ అమృత్ లాల్ విర్చంద్ జసాని విద్యామందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ కి రాజ్ కోట్ జిల్లా ప్రాథమిక విద్యాధికారి (డీపీఈఓ) రాసిన లేఖలో.. ‘మంగళవారం ఉదయం ఆంగ్ల మాధ్యమంలో 8వ తరగతి విద్యార్థిని రియా సోని 7.23 గంటలకు బాలేదని ఫిర్యాదు చేశారు. ఆమె తల్లిదండ్రులను పిలిచారు. కానీ ఆమెను ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చనిపోయినట్లు డాక్టరు చెప్పారు’ అంటూ రాశారు.
చలిగాలుల వల్ల..
రియా తల్లిదండ్రులు మాత్రం.. ‘ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు డీపీఈఓ ఆదేశాల మేరకు పాఠశాల వేళలు మార్చుకొని ఉంటే తమ కూతురు చనిపోయేది కాదని, చలిగాలుల్లో పిల్లలను రక్షించేలా స్వెటర్లు కూడా యాజమాన్యం వేసుకోనివ్వలేదని, చలిగాలుల కారణంగానే తమ కూతురు చనిపోయిందని’ అంటున్నారు. కానీ డాక్టర్లు మాత్రం ఆమె తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయిందని ప్రాథమిక నిరార్థణ చేశారు. అయితే ఆమె రక్తనమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఈ పరీక్ష తర్వాతనే మరణం అసలు కారణం నిర్ధారించగలమని డాక్టర్లు పేర్కొన్నారు.
పాఠశాల భద్రతా నియమాల ప్రకారం.. చలిగాలులు, భారీ వర్షాలు లేదా వేడిగాలుల కారణంగా పాఠశాల యాజమాన్యాలు అవసరాన్ని బట్టి పాఠశాల సమయాన్ని మార్చుకోవచ్చు. కాకపోతే విద్యార్థుల సంరక్షణ కూడా అందులో ముఖ్యమే.