అమెరికా కూడా మతరాజ్యమే, భారత్ ఒక్కటే సెక్యులర్.. రాజ్‌నాథ్  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా కూడా మతరాజ్యమే, భారత్ ఒక్కటే సెక్యులర్.. రాజ్‌నాథ్ 

January 22, 2020

Rajnath Singh On America  

అమెరికా ఒక మత రాజ్యం అంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో పాల్గొన్న క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ మాత్రం ఎన్నడూ మత రాజ్యం కాబోదని స్పష్టం చేశారు. భారత్ ఒక్కటే సెక్యులర్ దేశం అని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలు, ధర్మాలను గౌరవిస్తూ లౌకిక దేశంగా విరాజిల్లుతోందని చెప్పారు.

‘పాకిస్తాన్ కూడా మతపరమైన దేశమని స్వయంగా ప్రకటించుకుంది. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ అలా చేయబోదు. దేశంలో అన్ని మతాలకు సమాన విలువ ఉందు.అమెరికా సైతం మత రాజ్యమే. భారత్‌లో హిందూ,బౌద్ద,సిక్కు తదితర మతాలు ఉన్నాయి. ఇక్కడ ఏ మతాన్ని తమ మతంగా భారత్ ప్రకటించలేదు. అన్ని మతాలను కలిపి ఒక కుటుంబంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. అన్ని మతాలను, సంప్రదాయాలను మనదేశం గౌరవిస్తుంది. అందుకే మన దేశాన్ని వసుదైక కుటుంబం అని ప్రపంచ దేశాలకు చాటాలి’ అంటూ పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువజన విభాగమైన ఎన్సీసీలో భాగమైనందుకు అమ్మాయిలు, అబ్బాయిలు గర్వపడాలని అన్నారు.