చైనా బార్డర్‌లో రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ! - MicTv.in - Telugu News
mictv telugu

చైనా బార్డర్‌లో రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ!

October 25, 2020

చైనా బార్డర్‌లో

దసరా పండుగను పురస్కరించుకుని ఆయుధ పూజ నిర్వహించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా సరిహద్దులకు వెళ్లారు. వాస్తవాధీన రేఖకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో సిక్కింలోని షిరాతంగ్ ప్రాంతంలో రాజ్‌నాథ్ సింగ్ శస్త్ర పూజ చేయనున్నారు. ఆపై సైనికులతో దసరా పండగ చేసుకోనున్నారు. 

సుక్నా కేంద్రంగా ఉన్న 33 క్రాప్స్ హెడ్ కర్వార్టర్స్‌‌లో ఆయన భారత సైనిక ఆయుధ సంపత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి సైనిక దళాలను ‘త్రిశక్తి’గా పిలుస్తారు. శనివారం నాడు సిక్కిం చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్‌కు అక్కడి సైనిక అధికారులు స్వాగతం పలికారు. సిక్కింలో రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సైనికులను ప్రత్యేకంగా కలిసిన రాజ్‌నాథ్ సింగ్, వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.