వైసీపీకి ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా.. డిమాండ్ ఇదీ - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీకి ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా.. డిమాండ్ ఇదీ

April 18, 2022

ap

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని పనులు ఆ పార్టీ నేతలన నచ్చడం లేదు. ఫలితంగా కొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవులు రాని వారు చేపట్టిన అలకను తీర్చిన పార్టీకి ఇప్పుడు మరో సమస్య తల నొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, వాటి పేర్లు వివాదానికి కారణమవుతున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆజిల్లా పేరును మార్చాలని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ కారణంతో రాజోలు వైసీపీ ఎంపీటీసీ నెల్లి దుర్గా ప్రసాద్ సహా 38 మంది నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ పేరు పెట్టేలా చేసిన వినతులను పట్టించుకోని కారణంగా రాజీనామా చేసినట్టు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా దళిత వాడల్లో ఉన్న పార్టీ శ్రేణులతో రాజీనామా చేయిస్తామని తెలిపారు.