ఈసీ సంచలన నిర్ణయం..రాజ్యసభ ఎన్నికలు వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

ఈసీ సంచలన నిర్ణయం..రాజ్యసభ ఎన్నికలు వాయిదా

March 24, 2020

Rajya Sabha

కరోనా ప్రభావం రాజ్యసభ ఎన్నికలపై పడింది. ఈ నెల 26న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 31వ తేదీ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమీక్ష తర్వాత ఎప్పుడు ఎన్నికలు పెట్టాలనేది తిరిగి ప్రకటిస్తామని చెప్పారు. ఐదుగురికి మించి ప్రజలు గుమిగూడకూడదనే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని అన్నారు. అందుకే ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. 

రాజ్యసభలో ఏడాది 55 స్థానాలు ఖాళీగా అయ్యాయి. వీటిలో 37 స్థానాలు ఇది వరకే ఏకగ్రీవాలు అయ్యాయి. కానీ మిగిలిన 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో  గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లో నాలుగేసి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడేసి, రాజస్థాన్ లో రెండు మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగాల్సివుంది. ఎన్నిక సమయంలో అధికారులు, ఏజెంట్లు, ఓట్లు వేసే ప్రజా ప్రతినిథులు గుంపులుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే ఇబ్బందిగా భావించినట్టుగా ఈసీ వెల్లడించింది.