రాజ్యసభ మార్షల్స్ డ్రెస్ కోడ్ మార్పుపై లొల్లి - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యసభ మార్షల్స్ డ్రెస్ కోడ్ మార్పుపై లొల్లి

November 19, 2019

రాజ్యసభలో మార్షల్స్ డ్రెస్ కోడ్ మార్పు చేశారు. 250వ సమావేశాల సందర్భంగా పాత విధానానికి స్వస్తి చెప్పి కొత్త డ్రెస్ అందుబాటులోకి తెచ్చారు. గతంలో సఫారీతో పాటు తలపాగ, ధరించి ఉండే వారు. కానీ ఆధునిక అవసరాలకు తగినట్టుగా డ్రెస్ కోడ్ మార్చాలంటూ మార్షల్స్ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులతో చర్చించిన తర్వాత 250వ సమావేశాల నుంచి కొత్త డ్రెస్ కోడ్ తెచ్చారు. అయితే దీనిపై విపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.  

మారిన డ్రెస్ కోడ్ ముదురు నీలిరంగులో భుజాలపై చిహ్నాలు ఉంటూ బంగారు రంగు గుండీలు ఏర్పాటు చేశారు. తలపాగాకు బదులు టోపీని తెచ్చారు. విపక్షాలు మాత్రం సైనిక దుస్తుల తరహాలో కొత్త డ్రెస్సులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిగేడియర్, ఆపై అధికారులను తలపించేలా తయారు చేశారని వాటిని వెంటనే మార్చాలంటూ కోరారు. ఈ ఫిర్యాదులపై వెంకయ్య నాయుడు స్పందించారు. మరోసారి డ్రెస్‌కోడ్‌పై పునఃసమీక్షించాలంటూ రాజ్యసభ సెక్రటేరియట్ కార్యాలయాన్నికోరారు. 

ఏడాది కాలంగా డ్రెస్ కోడ్ మార్పుపై సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో చలిక ఎక్కువ ఉన్న కారణంగా 

మందపాటి సఫారి రకం దుస్తులు ఎంపిక చేశారు. వేసవి సమావేశాల్లో తెలుపు కాటన్ బ్లెండ్ యూనిఫామ్ ధరిస్తారు.అయితే యూపీ,ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధమైన డ్రెస్ కోడ్ ఉన్నట్టుగా రాజ్యసభ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.